Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రందాలయ శాఖ డైరెక్టర్ శ్రీనివాసచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈనెల 14 నుంచి 20వ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55 వ గ్రంధాలయ స్వర్ణోత్సవ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర గ్రంధాలయ శాఖ డైరెక్టర్ శ్రీనివాస చారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 న హైదరాబాద్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రంధాలయంలో వారోత్సవాలను రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర గ్రంధాలయ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ రావుల శ్రీధర్‌రెడ్డి, డీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.
ఈ సందర్బంగా పుస్తక ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు, సదస్సులు, సాంస్కృతిక పోటీలతోపాటు విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాస రచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.