Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొడుకును చంపిండనే కసితో..
- నిందితుడిని నరికిన తల్లిదండ్రులు
- భయాందోళనలో గ్రామస్తులు
నవతెలంగాణ-మునిపల్లి
పాత కక్షలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చల్లా రాజశేఖర్ కథనం ప్రకారం.. చిన్నచెల్మెడ గ్రామానికి చెందిన తలారి ప్రవీణ్, బేగరి ఆనంద్ స్నేహితులు. కాగా, ప్రవీణ్ (22)ను ఆనంద్ 2020 అక్టోబర్ 30న గ్రామ శివారులోని పత్తి చేనులో నరికి చంపిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా ప్రాణానికి ప్రాణం తీయాలనే కసితో ప్రవీణ్ కుటుంబ సభ్యులు సమయం కోసం వేచి చూశారు. శుక్రవారం ఉదయం ఆనంద్(28) గ్రామంలో ఒంటరిగా తిరుగుతున్నట్టు ప్రవీణ్ కుటుంబ సభ్యులు సమాచారం అందుకున్నారు. వెంటనే కారం, మారణాయుధాలతో వెళ్లి మూకుమ్మడిగా ఆనంద్‌పై దాడి చేశారు. ఆనంద్ కళ్లల్లో కారం చల్లి.. తల, మొండం, రెండు చేతులు నరికేశారు. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన ఆనంద్ తమ కండ్ల ముందు తిరగడాన్ని జీర్ణించుకోలేకనే హత్య చేసినట్టు పోలీసుల ముందు నిందితులు ఒప్పుకున్నట్టు తెలిసింది. సంఘటనా స్థలాన్ని కొండాపూర్, మునిపల్లి సీఐ సంతోష్‌కుమార్ పరిశీలించారు. హత్యకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు నిందితులు తలారి అంబయ్య, స్వరూప, తలారి ప్రభుదాస్లపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.