Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్ నుంచి కేరళకు వెళ్లి, వచ్చే శబరిమల భక్తుల కోసం రానుపోను కలిపి 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసులు సికింద్రాబాద్-కాజీపేట-వరంగల్, సికింద్రాబాద్-చర్లపల్లి-మిర్యాలగూడెం, సికింద్రాబాద్-కాచిగూడ- మహబూబ్‌నగర్- గద్వాల మార్గాల్లో నడుస్తాయని పేర్కొన్నారు. నవంబర్ 20 నుంచి జనవరి 17 తేదీల మధ్యలో నడువనున్నాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వేను సంప్రదించాలని సూచించారు.