Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎన్జీవో యూనియన్ హైదరా బాద్ జిల్లా అధ్యక్షుడిగా సేవారత్న, సేవా భూషణ్ డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేని (ముజీబ్) అయిదోసారి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం నాంపల్లి యూనియన్ కార్యాలయంలో జరి గింది. జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవ తీర్మానంతో ముజీ బ్‌ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నకున్నారు. మొత్తం 18మందితో నూతన కార్య వర్గం ఏర్పాటైంది. ఈ ఎన్నికకు సంబంధించిన ప్రొసీడింగ్‌ను సెంట్ర ల్ యూనియన్ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందిందని, ముజీబ్ ఐదుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికకావటం ఆయన పనితీరుకు నిదర్శనమని కొని యాడారు.
ఒక సామాన్యుడిగా తాను చేసిన వివిధ సాంఘిక కార్యక్రమా లకు సేవారత్న, సేవాభూషణ్ అవార్డుతో సత్కరించారని గుర్తుచేశారు.