Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) 104 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఆ బ్యాంక్ శాఖల్లో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నగరంలోని ఆర్టీసీ కళాభవన్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో యూబీఐ కీలక అధికారులు సహా ఉద్యోగులు, రిటైర్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా యూబీఐ హైదరాబాద్ జోన్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ సురేష్ చంద్ర తెలి మాట్లాడుతూ.. తమ బ్యాంక్ విజయవంతంగా 103 ఏండ్లు పూర్తి చేసుకుందన్నారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ బ్యాంక్ ఎండీ, సీఈఓ మనిమెకలయి ఖాతాదారుల కోసం పది కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారని తెలిపారు.
నిజామాబాద్ రీజినల్ ఆఫీసులో...: నిజామాబాద్ రీజినల్ ఆఫీసులోనూ ఆ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.