Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం
- 'నవ తెలంగాణ' పుస్తక ప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ-హన్మకొండ
పుస్తక పఠనంతో పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ అన్నారు. శుక్రవారం హన్మకొండలో 'నవ తెలంగాణ' పబ్లిషింగ్ హౌస్లో ఏర్పాటు చేసిన బాలల పుస్తక ప్రదర్శనను కూడా చైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్, కార్పొరేటర్ మామిండ్ల రాజు, సీపీఎం నాయకులు వాసుదేవారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వినరుభాస్కర్ మాట్లాడుతూ.. సెల్ ఫోన్, కంప్యూటర్ వాడకం ఎక్కువైపోయిన ఈ తరుణంలో సైన్స్, విజ్ఞానదాయక పుస్తకాలు ప్రచురించి పిల్లల్లో దేశభక్తి-విజ్ఞానం పెంపొందించేందుకు ఎన్నో విలువైన పుస్తకాలతో నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఇలాంటి ప్రదర్శనలు చేయడం అభినందనీయమన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పుస్తకాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్, సీఐటీయూ నాయకులు వేల్పుల సారంగపాణి, బొట్ల, చక్రపాణి, మెడికల్ యూనియన్ నాయకులు డీజీ శ్రీనివాస్, నవ తెలంగాణ జనరల్ మేనేజర్ వాసు, మేనేజర్లు దేవేందర్రావు, కృష్ణారెడ్డి, వరంగల్ బుకహేౌస్ ఇన్చార్జి బాబు, లంక పాపిరెడ్డి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, శ్రీనివాస్, మేధావులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.