Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనులపై నిర్భంధం తగదు
- గృహ నిర్భంధంతో ఉద్యమాన్ని ఆపలేరు : తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ, వారిపై నిర్భంధం తగదని తెలంగాణ గిరిజన సంఘం(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తున్న సందర్భంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, అడవుల ప్రయివేటీకరణను ఉపసంహారించుకోవాలనీ,పెరిగిన గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 10శాతానికి రిజర్వేషన్లపెంపు, పెంచాలనీ, బయ్యారు ఉక్కు కర్మాగారం ఏర్పాటు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే దాన్ని పోలీసులు అప్రజాస్వామికంగా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఆ నిర్బంధాలను అధిగమించి హైదరాబాద్ నగరంతో పాటు అనేక జిల్లాల్లో 'మోడీ గో బ్యాక్' అంటూ నల్లబెలున్లను ఎగరేశారని తెలిపారు.శ్రీరాంనాయక్తో పాటు మరి కొంత మందిని ముందస్తుగానే గృహనిర్భంధం చేశారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన సంఘాల జేఏసీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ ,కొత్తగూడెం, సూర్యాపేట ,నాగర్ కర్నూల్, రంగారెడ్డి తదితర జిల్లా నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.