Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొత్తగా వేయి మత్స్యకార సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్యా రోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 650 మత్స్య సహకార సంఘాల్లో సభ్యులకు నైపుణ్య పరీక్షలు, మరో 334 సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.650. మత్స్య సహకార సంఘాల్లో 13 వేల 900 మందికి సభ్యత్వం ఇచ్చి నట్టు చెప్పారు. మూడు నెలల్లో ఈ సభ్యత్వ ప్రక్రియ పూర్తి చేయాలని మత్స్య శాఖ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 33 జిల్లాల్లో మత్ససహకార సంఘాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భవిష్యతులో మత్స్యకారుల అభివద్ధికి అవసరమైన పథకాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలి వ్వాలని అధికారులను ఆదేశించారు. ముదిరాజ్, యాదవ, కురమ సంఘ భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ నిర్మాణాలు రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సభ్యత్వ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.