Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాసమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని తెలుగుదేశం తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు నిచ్చారు.శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ఆ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. వాడ వాడలా, పల్లెపల్లెలో పసుపు జెండా ఎగిరేలా కృషి చేయాలని కోరారు. ఒక్కో నియోజక వర్గంలో 35వేల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలన్నారు. పార్టీలో చేరికలు ప్రొత్స హించాలనీ,ప్రజలకు మంచి చేయటమే లక్ష్యంగా ఉండాలని ఆదేశించారు.