Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన హామీలేమయ్యాయి...: ప్రధాని మోడీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పార్లమెంటు వేదికగా రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు 8 ఏండ్లుగా ఎందుకు అమలు చేయలేదంటూ పీసీసీ అధ్యక్షులు ఏ రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు, కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో చేర్చిన సంస్థలు, ఆస్తులు విభజన, రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణకు దక్కాల్సిన ఐఐటీ, ఐఐఎం, వ్యవసాయ విశ్వ విద్యాలయం, బీబీఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల మంజూరు సహా పలు అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. వీటిని ఎందుకు పరిష్కరించలేదో రాష్ట్ర ప్రజలకు ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కచ్చితంగా కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు.