Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి : మెదక్ చర్చి బిషప్ సాల్మన్ రాజు
నవతెలంగాణ-మెదక్ టౌన్
మెదక్ సీఎస్ఐ చర్చి బిషప్ రెవరెండ్ సాలమన్ రాజ్‌పై ఆదివారం మధ్యాహ్నం కత్తితో దాడికి యత్నించారు. చర్చి సభ్యులే ఆ దాడికి యత్నించినట్టు బిషప్ సాల్మన్ రాజు తెలిపారు. ఈ ఘటనపై మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ప్రాణ హాని ఉందని, తనపై హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అక్టోబర్ ఒకటో తేదీన జరిగిన చర్చి కమిటీ ఎన్నికల్లో తాను ఒక గ్రూపునకు మద్దతు ఇచ్చానని, ప్రత్యర్ధి గ్రూపు వారు తనను హత్య చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఆరాధన కార్యక్రమానికి విచ్చేసినప్పుడు దాదాపు 19 మంది తన వాహనాన్ని చుట్టుముట్టారన్నారు. అప్రమత్తమై కేకలు వేయడంతో తన అనుచరులు సకాలంలో రావడంతో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలి పారు. ఇలాంటి వారి కారణంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై సీఐ మధును వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.