Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, బీజేపీ నాయకుల తోపులాట
- కొద్తిసేపు ఉద్రిక్తత... చెదరగొట్టిన పోలీసులు
- మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్
నవతెలంగాణ - మునుగోడు
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య పోటాపోటీ నినాదాలతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గొల్ల కురుమల పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మొదటిసారి మునుగోడు నియోజకవర్గానికి రావడం తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ నుంచి చండూ రు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు రాగానే టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో పోటాపోటీ నినాదాల మధ్య ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. బైక్ ర్యాలీ చండూరుకు వెళ్తున్న తరుణంలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేయడం తో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు పార్టీల వారిని చెదరగొట్టారు.
అకౌంట్లను సీజ్ చేసే అర్హత కేసీఆర్‌కు ఎక్కడిది.. ?
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికల సమయంలో 7,540 మంది గొల్ల కురుమల లబ్దిదారుల అకౌంట్లో డబ్బులు జమచేసి.. ఆ వెంటనే వారి అకౌంట్లను ఎలా సీజ్ చేస్తారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. గొల్ల కురుమల పోరుబాట సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో అక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రాజగోపాల్‌రెడ్డిని చేసే క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో గొల్ల కురుమలను మోసం చేసేందుకు ఓట్ల ముందు నగదు బదిలీ పథకంతో కొత్త జీవోను తీసుకొచ్చి ఖాతాల్లో డబ్బులు జమ చేశారని.. తీరా అవి తీసుకోకుండా అకౌంట్లను లాక్ చేశారని విమర్శించారు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక గెలిచాక గొల్ల కురుమలకు పాత పద్ధతిలోనే గొర్రెలు అందిస్తామనడం దారమణన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మెన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, చౌటుప్పల్ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్, చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, దోనూరు వీరారెడ్డి పాల్గొన్నారు.