Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మరణానికి చేరువలో ఉన్న క్యాన్సర్ రోగుల కోసం పాలియేటివ్ కేర్ సేవలందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ సంస్థకు ఎస్బీఐ ఫౌండేషన్ రూ. 3.13 కోట్ల సహాయాన్ని అందజేసిం ది. రాబోయే 25 నెలల కాలానికి ఇండ్లలో సేవలందించేందుకు వీటిని అందజేశారు. అంతే కాకుండా ఆరు మారుతీ సుజుకి వాహనాలను విరా ళంగా ఇచ్చారు. శనివారం హైదరా బాద్లోని స్పర్శ్ ప్రాంగణంలోఈ సేవలను ఎస్బీఐ ఫౌడేషన్ ఎండీ, సీఇఓ సంజరు ప్రకాశ్ ప్రారంభిం చారు.కార్యక్రమంలో ఫౌండేషన్ హెల్త్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సీని యర్ మేనేజర్ రాజరాం చవాన్, కో ఆర్డినేటర్ సిద్ధలింగేష్ పాల్గొన్నారు.