Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఎఐ మిషన్ నిర్ణయం
హైదరాబాద్ : తెలంగాణ ఎఐ మిషన్ రేవ్ అఫ్ మూడో దశలో 62 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. ఈ స్టార్టప్‌ల్లో 13 రాష్ట్రాలకు చెందిన 15 రంగాల నుంచి ఉన్నాయని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. స్మార్ట్ సిటీలు, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశ్రమలు తదితర రంగాలకు చెందిన ఔత్సాహిక స్టార్టప్‌లు ఇందులో ఉన్నాయి. వీటికి ఇండిస్టీ బాడీ నాస్కామ్ మద్దతుతో స్టార్టప్‌లకు మద్దతునిచ్చే రేవ్ అప్‌లో భాగంగా 12 నెలల పాటు ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్సీ (ఎఐ)లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రోగ్రామ్‌ను గతేడాది ఆగస్టులో ప్రారంభించారు. ఇప్పటికే 140 ఎఐ స్టార్టప్‌లకు మద్దతునిచ్చారు. మూడో రౌండ్లో 220 దరఖాస్తులు వచ్చాయి. ఎంపిక చేసిన వాటిలో 80 శాతం ఇతర రాష్ట్రాల వారివే కావడం విశేషం. ఈ సంస్థలు వచ్చే ఏడాది హైదరాబాద్‌లో కార్యాలయాలను తెరవడానికి ఆసక్తిని కనబర్చాయి. మొత్తం స్టార్టప్‌లో 20 శాతం మహిళలు స్థాపించినవే. తదుపరి బృందం ఎంపిక 2023 మేలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.