Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- టీఎస్పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంటర్ విద్యాశాఖ కమిషనరేట్ పరిధిలో 1,392 జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో 1,100 జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణలో ఇప్పుడు జేఎల్ పోస్టుల భర్తీకి మొదటి నోటిఫికేషన్‌ను విడుదల చేయడం గమనార్హం. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 16 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు వచ్చేనెల ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువుందని వివరించారు. మల్టీజోన్-1 పరిధిలో 724, మల్టీజోన్-2 పరిధిలో 668 కలిపి మొత్తం 1,392 పోస్టులను భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. జూన్ లేదా జులైలో రాతపరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు
అరబిక్-2, బాటనీ-113, బాటనీ (ఉర్దూ మీడియం)-15, కెమిస్ట్రీ-113, కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం)-19, సివిక్స్-56, సివిక్స్ (ఉర్దూ మీడియం)-16, సివిక్స్ (మరాఠీ మీడియం)-1, కామర్స్-50, కామర్స్ (ఉర్దూ మీడియం)-7, ఎకనామిక్స్-81, ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) -15, ఇంగ్లీష్-153, ఫ్రెంచ్-2, హిందీ-117, హిస్టరీ-77, హిస్టరీ (ఉర్దూ మీడియం)-17, హిస్టరీ (మరాఠీ మీడియం)-1, మ్యాథమెటిక్స్-154, మ్యాథమెటిక్స్ (ఉర్దూ మీడియం)-9, ఫిజిక్స్-112, ఫిజిక్స్ (ఉర్దూ మీడియం)-18, సంస్కృతం-10, తెలుగు-60, ఉర్దూ-28, జువాలజీ-128, జువాలజీ (ఉర్దూ మీడియం)-18 చొప్పున మొత్తం 1,392 పోస్టులున్నాయి.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు : మధుసూదన్‌రెడ్డి
విశ్వవిద్యాలయాల్లో ఉండే విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ పి మధుసూదన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1,392 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు ప్రకటించారు.