Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కల్లుగీత కార్మిక సంఘం 65 ఏండ్ల ఉద్యమ యాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 13న హైదరాబాద్ లోని సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం అధ్యక్షులు ఎంవీ రమణ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సంబంధిత పోస్టర్‌ను అవిష్కరించారు. ఉద్యమ యాత్ర కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని రమణ తెలిపారు. సంఘం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు సాధించిన విజయాలు, పోరాటాల గురించి చర్చిస్తామన్నారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. సంఘంలో పనిచేస్తున్న క్రమంలో ఈ కాలంలో అమరులైన వారి కుటుంబాలకు ఈ సందర్భంగా ఆత్మీయ సన్మానం చేయనున్నట్టు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలోకల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. కృష్ణ స్వామి, మోదుగు పూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా అడ్వైజర్ గర్వందుల రాజు, పెద్ది రాణా ప్రతాప్, రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.