Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్
నవతెలంగాణ-గజ్వేల్
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ అసోస ియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రమణారెడ్డి, కుప్పిశెట్టి సురేష్ ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని అయ్యప్పస్వామి ఆలయం నుంచి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు శనివారం సంకల్ప ఆశిస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఈ సంకల్ప ఆశిస్సు పాదయాత్ర మూడ్రోజులపాటు కొనసాగి ఈనెల 12వ తేదీన కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు. మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో జీవో నెంబర్ 16 ద్వారా క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. అనివార్య కారణాల వల్ల కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఇంతవరకు జరగలేదన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమబద్ధీకరణ జరిగేందుకు సీఎం కేసీఆర్ ఇష్టదైవం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశిస్సులు మన అందరిపై ఉండాలని కోరుతూ ఈ యాత్రను చేపడుతున్నామన్నారు. ఈ యాత్రకు తెలంగాణ ఇంటర్మీడియట్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మైలారం జంగయ్య, మాచర్ల రామకృష్ణ గౌడ్ ఆశిస్సులు అందజేశారని చెప్పారు. టీఎస్ యుటీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు వలి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరవింద్ సంఘీ భావం అంద జేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 475 యూనియన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ వి.శ్రీనివాస్, కెపి శోభన్ బాబు, ఎం.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పడాల జగన్నాథం, బొంకు ప్రవీణ్ కుమార్, ఎం.ప్రవీణ్ కుమార్, కురుమూర్తి, గంగాధర్, గోవర్ధన్, సంగీత, సాయిలు, కాంపల్లి శంకర్, విక్రమాదిత్య, మధుకర్, సాయిలు సంగీత పాలిటెక్నిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి ఉదయభాస్కర్, నాయకులు సునీల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.