Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామీణాభివృద్ధి శాఖలో విధులు నిర్వహిస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు టైంస్కేల్ ఇవ్వాలని ఎంఎన్ఆర్ జీఈజీఎస్ జేఏసీ కోరింది. ఈ మేరకు జేఎసీ కన్వీనర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి తొమ్మిదిన అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రకాల సేవలందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరసలో నిలిపే క్రమంలో భాగస్వాములుగా ఉన్నామని తెలిపారు. తమను 2006లో జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా రోస్టర్ పద్ధతిలో నియమించుకున్నారని గుర్తు చేశారు. 2008 నుంచి హెచ్ఆర్ పాలసీ పరిధిలోకి తెచ్చి ఒకే కమిషనర్ రూరల్ డెవలప్ మెంట్ క్రింద ఎఫ్‌టీఈలు నియమించారని తెలిపారు. దీంతో సెర్ప్‌లో ఉన్న 3,954 మందికిపైగా ఉద్యోగులకు టైం స్కేల్ వర్తిస్తుండగా, ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో పని చేస్తున్న 3,874 మంది కవర్ కావడం లేదని తెలిపారు.