Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్.ఎస్.జె.థామస్
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (హెచ్చార్సీ) సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్.ఎస్.జె.థామస్ తెలి పారు. ప్రపంచ మానవ హక్కుల దినో త్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ మెట్టుగూడలోని హెచ్ ఆర్సీ సౌత్ ఇండియా కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ బాధితులకు న్యాయం పొందే విషయంలో సహాయపడుతూ వారి హక్కులను కాపాడుతున్న క్రమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్చార్సీ జాతీయ మహిళా అధ్యక్షురాలు షీబా, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి, దక్షిణాది రాష్ట్రాల నుంచి హెచ్చార్సీ అధ్యక్షులతో పాటు వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.