Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజలిచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్గా మార్చిన సీఎం కేసీఆర్కు గుణపాఠం చెప్పాలం టూ తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను పట్టించు కోకుండా, విద్యావ్యవస్థను భ్రష్టు ప ట్టించి, ఉద్యమకారులను మోసం చేసి న కేసీఆర్ దేశ రాజకీయాల్లో చేసే దేమి లేదని విమర్శించారు.