Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 1.28 కోట్ల విలువైన బంగారు నగలు, బిస్కెట్లు పట్టివేత
- దుబాయ్ నుంచి వస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కిన ప్రయాణికుడు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారు బిస్కెట్లు, నగలతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు ఒకరు కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. శనివారం విమానాశ్రయం లో దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా కస్టమ్స్ అధికారులు ఆయనను పట్టుకొని విచారించారు. ఆయన వద్ద ఉన్న బ్యాగును సోదా చేయగా బంగారు నగలతో పాటు బంగారు బిస్కెట్లు బయట పడ్డాయి. హైదరాబాద్లో ఒకరికి అందజేయటానికి ఈ బంగారాన్ని తీసుకు వచ్చినట్టు కస్టమ్స్ అధికారులకు విచారణలో వెల్లడైంది. 212 గ్రాముల బరువున్న ఈ బంగారం విలువ రూ. 1.28 కోట్లుగా కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని సదరు ప్రయాణికుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఇక్కడ ఎవరికి అందజేయనున్నాడు? అనే కోణంలో కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది.