Authorization
Thu May 01, 2025 07:29:44 pm
- రెండు వర్గాలు పాల్గొనాలి...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎమ్‌యూ) జనరల్ బాడీ సమావేశం ఈనెల 15న ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా ఉన్న వీఎస్టీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రెండు గ్రూపుల ప్రధాన కార్యదర్శులు థామస్‌రెడ్డి, ఏఆర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కమిటీ, జోనల్ కమిటీ, రీజనల్ కమిటీ, డివిజన్ కమిటీ, డిపో కమిటీ, నాన్ ఆపరేటింగ్ అండ్ వర్క్‌షాప్ కమిటీలు, హెడ్ ఆఫీస్ అండ్ తార్నాక కమిటీ ముఖ్య నాయకులు అందరూ ఆరోజు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. ఈనెల 9న యూనియన్ ఆఫీసులో జరిగిన ఉభయవర్గాల ముఖ్య నాయకుల అత్యవసర సమావేశంలో యూనియన్ ఉమ్మడి కార్యాచరణపై సమగ్రంగా చర్చించి కలిసి పనిచేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. అందువల్ల రెండు వర్గాల నాయకులు సమావేశానికి హాజరై ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సమావేశ అజెండాను ప్రకటించారు. సమగ్రమైన యూనియన్ ఆర్గనైజేషన్ గురించి దిశానిర్దేశం, రాష్ట్ర కమిటీ పునర్వ్యస్థీకరణలో భాగంగా కొత్త కమిటీ ఏర్పాటు, యూనియన్ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన ఉంటాయని తెలిపారు.