Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ గురుకుల స్కూల్ విద్యార్థి మౌనిక
- మంత్రి గంగుల అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైఫిల్ షూటింగ్లో జాతీయ స్థాయి పోటీలకు బీసీ గురుకుల స్కూల్ విద్యార్థి మౌనిక అర్హత సాధించింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమాలకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు ఆమెను అభినందించారు. కీసరలోని మహాత్యా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో రైఫిల్ షూటింగ్లో శిక్షణ ప్రారంభించారు. ఆసక్తి గల విద్యార్థులకు కోచ్ సహాయంతో శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 25 మంది బాలికలు శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో తొమ్మిదో తరగతి చదువుతున్న మౌనిక విశేష ప్రతిభను కనబరచడంతో ఆమెను గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్ఠాయి పోటీలకు పంపించారు. అక్కడ మంచి ర్యాంక్ సాధించిన మౌనిక సౌత్ జోన్ స్ఠాయి పోటీలకు ఎంపిక కావడంతో గత నెల కేరళలో జరిగిన పోటీలకు పంపించారు. అక్కడా తన ప్రతిభను ప్రదర్శించి మౌనిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈనెల 8న భోపాల్ లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్ని రైఫిల్ తన గురి తప్పదని మరోసారి నిరూపించింది. జాతీయ స్థాయిలో వచ్చే ఏడాది జరిగే పోటీలకు ఎంపికైంది.