Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ వ్యవస్థాపక దినోత్సవ ప్రచార కటవుట్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలకుల ప్రజావ్యతరేక విధానాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ సమాజ అభ్యున్నతే సీపీఐ ముందుకు సాగుతున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయంలో పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవ ప్రచార కటవుట్ను అవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశంలో ఫాసిజం ప్రమాదం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీపీఐ 98 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు. భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. ప్రజల రక్షణ కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన చరిత్ర సీపీఐకే ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.