Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్‌లో రూ.2,892 కోట్ల లావాదేవీలు
- నైట్ ఫ్రాంక్ వెల్లడి
హైదరాబాద్ : గడిచిన నవంబర్‌లో హైదరాబాద్‌లో రూ.2,892 కోట్ల విలువ చేసే 6,119 యూనిట్ల నివాస ఆస్తులు రిజిస్ట్రేషన్ అయ్యాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో 7,768 ప్రాపర్టీలో రిజిస్ట్రేషన్లతో పోల్చితే.. 21 శాతం తగ్గుదల చోటు చేసుకుందని తెలిపింది. కాగా.. గడిచిన అక్టోబర్ నెలవారీ ప్రాతిపదికన యూనిట్లతో పోల్చితే 32 శాతం పెరుగుదల నమోదయ్యినట్లు పేర్కొంది. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు 62,159 రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని.. వీటి మొత్తం విలువ రూ.30,415 కోట్లుగా ఉందని తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.33,531 కోట్ల విలువ చేసే 75,453 రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపింది. హైదరాబాద్ నివాస మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాలను పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.