Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ట్ ఫెర్టిలిటీ క్లినిక్స్ సీఈఓ వెల్లడి
- సంస్థలో చేరిన కెడి నయ్యర్
హైదరాబాద్ : వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 24 నుంచి 30 ఆర్ట్ ఫెర్టిలిటీ క్లినిక్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ సోమేష్ కుమార్ మిట్టల్ తెలిపారు. సంతాన సాఫల్యత నిఫుణులు డాక్టర్ కెడి నయ్యర్ ఆర్ట్ ఫెర్టిలిటీలో చేరారని శనివారం హైదరాబాద్లో ఆయన మీడియాకు తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నరు, గురుగావ్, అహ్మాదాబాద్లో క్లినిక్లను కలిగి ఉందన్నారు. వచ్చే రెండేళ్లలో దక్షిణాదిలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలను ప్రారంభిస్తామన్నారు. దేశంలో 15 శాతం కుటుంబాలు సంతాన లేమిని ఎదుర్కొంటున్నాయన్నారు. ఇతర ఫెర్టిలిటీ సెంటర్లతో పోల్చితే తమ సంస్థ తక్కువగా ఛార్జ్ చేయడంతో పాటుగా అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ సహ మెడికల్ డైరెక్టర్లు డాక్టర్లు రిచా జగ్తాప్, పరుల్ కటియర్, ఫతెమి పాల్గొని మాట్లాడారు.