Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృత్తివిద్యా ఉపాధ్యాయులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా గుర్రం చెన్న కేశవ రెడ్డిని గెలిపించుకుందామంటూ వృత్తివిద్యా ఉపాధ్యా యులు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ పీఆర్ టీయూటీఎస్ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడిశల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పోతిగంటి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వృత్తి విద్యా ఉపాధ్యాయ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గసభ్యులు దాదాపు 150 మందికి పైగా పాల్గొని 2003 డీయస్సీతో పాటు వృత్తివిద్యా ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం, 1985 నుంచి ప్రీ -రెగ్యులరైజేషన్ పీరియడ్‌ను రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హైకోర్టుకు వెళ్లాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. సమావేశా నికి అధ్యక్షత వహించిన పీఆర్ టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు మాట్లాడుతూ 2003 డీయస్సీ ఫైలు ద్వారా వృత్తి విద్యా ఉపాధ్యాయులకు ఓపీఎస్ ఇప్పించేందుకు ముఖ్య మంత్రిని ఒప్పించినట్టు తెలిపారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 179 ప్రకారం... తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వారికి మొదటి నియా మకపు తేదీ నుంచి ప్రీ-రెగ్యులరైజేషన్ పీరియడ్‌ను కచ్చితం గా ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గుర్రం చెన్నకేశవరెడ్డిని మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలిపించాలని ఆ సమావేశం నిర్ణయించింది.