Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- మానవహక్కుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ
నవతెలంగాణ-ముషీరాబాద్
హింస, వివక్షత లేని సమాజం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని వీఎస్టీ నుంచి వీరనారి ఐలమ్మ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణజ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సభలో మల్లు లకిë మాట్లాడారు. రాజ్యాంగంలో కులం, మతం, జాతి, వర్ణం, లింగ వివక్షతలు లేకుండా అందరికీ సమానంగా జీవించే హక్కులు పొందుపర్చారన్నారు. అయితే, నేడు వాటి మీద దాడి జరుగుతోందని, ఆ హక్కులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తినే తిండి మీద, వేసుకునే బట్టల మీద ఆంక్షలు విధిస్తూ, మరోపక్క భావ ప్రకటన స్వేచ్ఛ పైన దాడి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులు, అభ్యుదయ వాదులు, పాత్రికేయులు, రచయితలపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని చెప్పారు. మహిళలపై వివక్షత, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు నిత్యకృత్యం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గుటేరస్ భారత్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతెందని పరోక్షంగా విమర్శించినట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయక కార్యదర్శులు కె.నాగలక్ష్మి, మద్దెల వినోద, పి.శశికళ, రాష్ట్ర కమిటీ సభ్యులు స్వర్ణలత, షబానా, పద్మ, జిల్లాల నాయకత్వం వరలక్ష్మి, పద్మ, లవణ్య, రాణిభారు తదితరులు పాల్గొన్నారు.