Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల్ని తీసుకొస్తున్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తాము విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదనీ, వాటి తయారీ, నిర్వ హణపై కేంద్రప్రభుత్వం రూపొందించిన విధి విధా నాలనే వ్యతిరేకిస్తున్నామని తెలి పారు. టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర తృతీయ మహాసభల సందర్భంగా శనివారం నాడి క్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'విద్యుత్ బస్సు లు- ఆర్టీసీ, సమాజంపై ప్రభావం' అంశం పై సదస్సు జరిగింది. ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ రాంచందర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆలిం డియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడ రేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య ముఖ్య అతిధిగా హాజరై, మాట్లాడారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ వాహనాలను ప్రవే శపెడితే కాలుష్యం తగ్గదనీ, ప్రజా రవాణాను ప్రోత్సహిస్తేనే అది సాధ్య మవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల తయారీ, నిర్వహణలో ఆర్టీసీలకు ఎందుకు అవ కాశం ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఒక్క విద్యుత్ బస్సు తయారీ ఖర్చు రూ. 2.20 కోట్ల నుంచి రూ.1.80 కోట్లకు తగ్గిందని చెప్పారు. సాధారణ బస్సుల తో పోలిస్తే, నిర్వహణ తక్కువ గా ఉంటుందని చెప్తున్నారనీ, మరి పెట్టు బడి ఎక్కువ అవుతున్న విషయాన్ని మాత్రం ప్రస్తావించట్లేదన్నా రు. పైగా ఈ బస్సులను ఆర్టీసీలకు అద్దెకు ఇస్తే, కిలో మీటర్‌కు అదనంగా రూ.7 వరకు చెల్లించాల్సి వస్తుందనీ, ఈ భారాన్ని ఎవరు భరించాలని అడి గారు. అంతర్జాతీయ గ్లాస్కో సమ్మిట్ లో గ్లోబల్ వార్మింగ్ పేరుతో 2030 నాటికి 50 శాతం, 2070 నాటికి పూర్తిగా పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటన చేసిందని గుర్తుచేశారు. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం వెద జల్లుతున్న దేశాల్లో అమెరికా 27 శాతం కాలుష్యాన్ని వెలువరిస్తున్నదనీ, ఆ తర్వాతి స్థానం 22 శాతంతో యూరప్ దేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ దేశాలు కాలుష్యాన్ని తగ్గించు కోకుండా, భారతదేశం వంటి దేశాలకు ఆదేశాలు జారీ చేయడం ఏంటని ప్రశ్నిం చారు. విద్యుత్ వాహనాల కొనుగోలుపై సబ్సిడీని ప్రపంచబ్యాంక్ చెల్లిస్తున్నదని తెలిపారు. దేశంలో అత్యధిక విద్యుదుత్పత్తి ప్రభుత్వ రంగంలోనే ఉందనీ, దాన్ని ఇప్పుడు ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగానే ఈ తరహా విధాన నిర్ణయాలను కేంద్రం తీసుకుం టున్నదని వివరిం చారు. ఆర్టీసీలకు విద్యుత్ బస్సులు ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారనీ, కానీ ఆ బస్సు లు ఏవీ ఆర్టీసీ పేరున రిజిస్ట్రేషన్ తో ఉండవని చెప్పారు. కేంద్ర ఆంక్షలకు తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు తలొ గ్గలేదనీ, తమ రాష్ట్రాల్లో ప్రజారవాణా ను తామే నిర్వహించుకుంటామని తేల్చిచెప్పాయన్నారు. దేశంలోకెల్లా అత్యధికంగా పూనాలో వంద ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయనీ, ఇక్కడ కిలోమీటర్‌కు రూ.10 అదనంగా అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ చెల్లిస్తు న్నదని ఉదహరించారు. ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో అమెరికా ప్రయోజ నాలు కాపాడటం కోసమే దేశంలోకి విద్యుత్ వాహనాలను ప్రవేశ పెడుతున్నారని స్పష్టం చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే ందుకే ఎలక్ట్రిక్ బస్సుల్ని తెస్తున్నారని చెప్పారు. దేశంలో వ్యక్తిగత వాహానాల సంఖ్య పెరుగుతున్నదనీ, ప్రజా రవా ణాను ప్రోత్సహిస్తే, సహజంగానే ఆ వాహనాల వినియోగం తగ్గుతుందని అన్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు నిర్ణయాలు తీసుకోవట్లేదన్నా రు. ఆర్టీసీలోకి విద్యుత్ బస్సులు వస్తే 15 వేల మంది ఉద్యోగులు మిగులు సిబ్బందిగా మారతారని హెచ్చరించా రు. కేంద్రప్రభుత్వ విధానాలను రాష్ట్రం వ్యతిరేకించాలనీ, ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన నిలుస్తూ విద్యుత్ బస్సుల విది óవిధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఐక్యపోరాటాల ద్వారానే ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగల మని స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల నిర్వహణలో ఆర్టీసీలకు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) నిబంధన పెడుతున్నారనీ, ఇది అమల్లోకి వస్తే, ఆ బస్సులు తిరిగినా, లేకున్నా ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ పేరు తో రవాణారంగాన్ని కార్పొరేట్లకు అప్ప గించే కుట్రలు జరుగుతున్నాయనీ, వీటిపట్ల ప్రజలు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిం చారు. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీల్లోకి వస్తే అదనంగా కిలోమీటర్‌కు రూ.14 నుంచి రూ.16 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందనీ, దీనివల్ల ఆర్టీసీ ఆర్థికంగా మరింత కుదించుకుపోతు ందని అన్నారు. బస్సుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రవేశపెడితే, ఉద్యోగుల అవసరం కూడా ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే సబ్సిడీలు ఇస్తున్నదనీ, వీటిని ప్రపంచబ్యాంకు ద్వారా చెల్లి స్తున్నారని వివరించారు. ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ సుందరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వేసిన భక్త వత్సలం కమిటీ రిపోర్టును ఇప్పటి వరకు బయటపెట్టలేదని చెప్పారు. ఏపీలో తిరుపతి- తిరుమల కేంద్రంగా వంద ఎలక్ట్రిక్ బస్సులు తిరుగు తున్నాయనీ, ఫలితంగా అక్కడి అలిపిరి డిపో మూత పడే స్థితికి వచ్చిందని తెలి పారు. టీఎన్టీ యూసీ (కార్మికపరిషత్) ప్రధాన కార్యదర్శి యాదగిరి మాట్లా డుతూ కార్మికుల ప్రయోజనాలు కాపాడటంలో సీఐటీయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఎప్పుడూ ముందుంటా యని చెప్పారు. ప్రజారవాణా పరిరక్షణకు ఎస్డ బ్య్లూఎఫ్ అకుంఠిత దీక్షతో పనిచేస్తుందంటూ, మహా సభల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఏఐ ఆర్ టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు.