Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజ్జెల కాంతం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో బీజేపీ దేశాన్ని పాలిస్తున్నదని ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జెల కాంతం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీబీఐ, ఐటీ, ఈడీ తదితర కేంద్ర సంస్థలు బీజేపీకి ఏజెంట్‌గా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సంస్థలు ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నదని ఆరోపించారు. సింగరేణిని ప్రయివేటీకరించబోమంటూనే సింగరేణి నాలుగు బ్లాకులను ప్రయివేటీకరణ ఎలా చేశారో తెలిపాలనీ,బండి సంజయ్‌కి రూ.700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు.