Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరితారెడ్డిని అరెస్ట్ చేయాలి
- కేవీపీఎస్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుడైన దళితుడిని చెప్పుతో కొట్టి అవమానించిన సర్పంచ్ సరితారెడ్డిని అరెస్టు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం బాజకుంట గ్రామానికి చెందిన అగ్రకుల సర్పంచ్ ఈదునూరి సరితరెడ్డి నడిబజారులో జనం అందరూ చూస్తుండగానే దళితుడిపై దాడి చేసి విచక్షణారహితంగా చెప్పుతో కొట్టిందని తెలిపారు.ఇది అగ్రకుల అహంకారం తప్ప మరొకటి కాదని గుర్తుచేశారు. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఆమెను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాజకుంట గ్రామంలో 22 దళిత కుటుంబాలకు దళిత బంధు కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల రావడంతో సర్పంచ్‌నైన తమకు లంచం ఇవ్వాలని అడిగిందనీ, నిరాకరించినందున్నే ఈ దాడికి పాల్పడిందని తెలిపారు. జస్టీస్ పున్నయ్య కమీషన్ సిఫారసుల మేరకు ఆ గ్రామాన్ని సందర్శించి దళితులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణం విచారణ జరిపి, ఎస్స్సీ,ఎస్స్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి శిక్షించాల విజ్ఞప్తి చేశారు. దాడి సంఘటనను వీడియో తీసిన వ్యక్తికి సర్పంచ్ నుంచి ప్రాణ హని ఉన్నందున అతనికి ప్రత్యేక రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు.