Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...
నవతెలంగాణ-టేకులపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు సమీపంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణ సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. టేకులపల్లి సీఐ ఏ.ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం.. శాంతినగర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షులు ధరావత్ బాలాజీ కుమారుడు ధారావత్ అశోక్(27) ఖమ్మం పట్టణంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి భద్రాద్రి జిల్లాలోని తన స్వగ్రామానికి రాగా, ముత్యాలంపాడు ఎక్స్ రోడ్ గ్రామ పంచాయతీకి చెందిన గుగులోత్ ప్రేమ్ తరుచుగా ఫోన్ చేస్తున్నాడని, ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడని తెలిపారు. తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తల్లిదండ్రులు తెలిపారు. ఫిర్యాదు మేరకు మండల పరిధిలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. అశోక్ రెండు చేతులు, మణికట్టు కత్తితో కోసి బండరాళ్లతో ముఖంపై బాదినట్టు తెలిపారు. మృతుని తండ్రి ధరావత్ బాలాజీ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు, అనంతరం మర్డర్ కేసుగా గుర్తించి గుగులోతు ప్రేమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతునికి భార్యతో పాటు మూడు నెలల పాప ఉంది.