Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిన్ని ఇవ్వాలి - శాట్స్ మాజీ ఛైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం తెలంగాణకు 17 ఖేలో ఇండియా సెంటర్లను మంజూరు చేసిందని శాట్స్ మాజీ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. గడచిన ఆరు నెలలుగా తాము అనేక లేఖలు కేంద్రానికి రాసామనీ, అయినా కోరినన్ని కేంద్రాలు ఇవ్వలేదని ఆక్షేపించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు 34 ఖేలో ఇండియా సెంటర్లు మంజూరు చేసి, తెలంగాణకు కేవలం 17 మాత్రమే మంజూరు చేశారన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై చూపు తున్న వివక్ష, నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత యువతీ యువకులు క్రీడల్లో గొప్పగా ఎదిగి, భారత దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. ఈ 17 ఖేలో ఇండియా సెంటర్లను త్వరలో ప్రారంభించి శిక్షణ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ పాలసీని తెచ్చి క్రీడాకారులను ప్రోత్సహించనున్నదని తెలిపారు.