Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన మంత్రులు జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆగ్రోస్ నూతన చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని ఆగ్రోస్ కార్యాలయంలో మంత్రుల సమక్షంలో ఆగ్రోస్ సీఎండీ కె. రాములు ఆయనతో ఫైల్ సంతకం చేయించారు. విజయ సింహారెడ్డికి మంత్రులు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బడు గుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆధునాతన మార్కెట్‌గా కోహెడ : నిరంజన్‌రెడ్డి
ప్రపంచంలోనే కోహెడ ఆధునాతన మార్కెట్‌గా నిర్మాణం కాబోతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం కోహెడ మార్కెట్ స్థలాన్ని మంత్రి, అధికారులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవరణంలో గోదాములు, లాజిస్టిక్ పార్క్, ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్ట్ మేనేజ్ మెంట్, రీ సైక్లింగ్ , సోలార్ సిస్టమ్, కోల్డ్ స్టోరేజ్ గోదాంలు, రైపెనింగ్ చాంబర్లు, లేబర్, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రహదారి ఏర్పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉన్న నేపథ్యంలో కోహెడ మార్కెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.