Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు మంద కృష్ణ మాదిగ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. 2014, 2018 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోల్లో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు, దళిత బంధు తరహాలో జర్నలిస్టులందరికీ జర్నలిస్టు బంధును ప్రవేశపెట్టాలని కోరారు. దళిత బంధులో దళిత జర్నలిస్టులకు ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. చిన్న, పెద్ద పత్రికలు, హౌసింగ్ సొసైటీలో ఉన్నా, లేకపోయినా తేడా లేకుండా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి, ఇండ్లు నిర్మించి మెగా జర్నలిస్టు కాలనీలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.