Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చీకోటి ప్రవీణ్ నేపాల్ క్యాసినో కేసులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ శేఖర్‌ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. ఇంతకముందు, తలసాని సోదరులిద్దరినీ కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కాగా, నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు సంబంధించి హైదరాబాద్‌లో కొందరు ప్రముఖుల నుంచి క్యాసినో ఫీజును పెద్ద మొత్తంలో వసూలు చేయటంలో శేఖర్ పాత్ర ఉందనే విషయమై ఈడీ ఆరా తీసినట్టు తెలిసింది. ఈ డబ్బులను ఏ మార్గం ద్వారా నేపాల్‌కు పంపించారనే విషయంపై శేఖర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.