Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రజకులకు ప్రమాద బీమా, ఉచిత విద్యుత్ పథకం ఎల్టీ 2 నుంచి ఎల్టీ4 లోకి చేర్చాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య, సహాయ కార్యదర్శి జ్యోతి ఉపేందర్, సి.మల్లేశం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు హైదరాబాద్లో సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ మెదక్ జిల్లా కోనాయపల్లి, అల్లదుర్గం మండలం అప్పాజీపల్లి, రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ప్రశాంతినగర్, మంచిర్యాల జిల్లా నర్సపుర్ మండలం,తళ్ళపల్లి మొదలగు ప్రాంతాల్లో చెరువుల్లో పడి ముగ్గురు రజక వృత్తి మహిళలు మరణించారని తెలిపారు. కరెంటు షాకుతో ఒక ఇస్త్రీ షాపు దగ్ధమైందనీ, విలువైన బట్టలు కాలిపోయాయని గుర్తుచేశారు. ఎక్కడో ఒకచోట కరెంటు ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రూ:5లక్షల భీమా పథకం ఏర్పాటు చేయాలని కోరారు. ఉచిత విద్యుత్ పథకకానికి సంబంధించిన ఎల్టీ 2, క్యాటగిరి ద్వారా కరెంటు బిల్లుల అధికంగా రావటంతో వృత్తిదారులనే బిల్లులు చెల్లించాలని కరెంటు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.ఎల్టీ 4 కు మార్పు చేసి అధనపు బిల్లు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.