Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
- ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఎంఫిల్, పీహెచ్డీ చేసే మైనారిటీ పరిశోధక విద్యార్థులకు మౌలానా ఆజాద్ పేరిట ప్రత్యేకంగా ఇచ్చే ఉపకార వేతనాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి స్మతీ ఇరానీ చేసిన ప్రకటనను బేషరతుగా ఉపసంహరించుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్రలు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని వారు ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్నదని అన్నారు.ఉపకారవేతన సహాయంతోనే చదువుకుంటున్న పరిశోధక విద్యార్థులు దేశ వ్యాప్తంగా లక్షలాదిగా ఉన్నారనీ, వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మౌలానా ఆజాద్ ఉపకార వేతన నిర్ణయాన్ని పునరుద్ధరణ చేయాలనీ, లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా విద్యార్థి, యువతను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.