Authorization
Thu May 01, 2025 05:12:18 pm
- కొత్త ప్లాంట్‌కు రూ.200 కోట్ల పెట్టుబడి
- ఎస్3వి వాస్కులర్ టెక్నాలజీ వెల్లడి
నవతెలంగాణ- హైదరాబాద్
పక్షపాతాన్ని తిప్పి కొట్టడం లో ఉపయోగపడే అత్యాధునిక, విప్లవా త్మకమైన న్యూరో క్లాట్ రిట్రీవర్, న్యూరో ఆస్పిరేషన్ కాథెటర్, న్యూరో మైక్రో కాథెటర్ పరికరాలను అందు బాటులోకి తెస్తున్నట్లు ఎస్3వి వాస్కులర్ టెక్నాలజీస్ వెల్లడించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ కంపెనీ వ్యవస్థాపకులు బదరీ నారాయణ్ మాట్లాడుతూ.. ఈ ఉత్పత్తులను గురువారం గవర్నర్ తమిళసై ఆవిష్కరించనున్నారని తెలిపారు. దేశంలోనే తొలిసారి తాము ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. మైసూర్లో రూ.200 కోట్లతో నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ప్రతి సంవత్సరం 20 లక్షల బ్రెయిన్ స్ట్రోక్‌లు జరుగు తుండగా, కేవలం 1500 మాత్రమే ఇంటర్వెన్షనల్ విధానాలకు వెళుతున్నా రని వెల్ల డించారు. తమ సంస్థ హై-ఎండ్ స్ట్రోక్ ట్రీట్మెంట్ టెక్నాలజీని చౌక వ్యయంలో సామాన్యులకు అందించడానికి ప్రయత్నిస్తోందన్నారు. రాబోయే దశాబ్దంలో ఇంటర్వెన్షనల్ విధానాల సంఖ్య సంవత్సరానికి కనీసం 2.5 లక్షలకు పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ పరికరాల తో, గోల్డెన్ అవర్‌లో ప్రక్రియలు సకాలంలో జరిగితే, రక్త ప్రసరణ పునరుద్ధరించబడ టానికి, పక్షవాతం తిరగబెట్టడానికి అధిక అవకాశం ఉందన్నారు. గ్లోబల్ కంపెనీలతో పోల్చితే తమ పరికరాల ధరలు కూడా చాలా తక్కువ ధరకు లభించనున్నాయన్నారు.