Authorization
Thu May 01, 2025 07:17:16 am
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వానాకాలం పంటకు సంబంధించి రాష్ట్రంలో 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడు దల చేశారు. 7,011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగానూ 4,607 కొను గోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయిందనీ, దీంతో వాటిని మూసివేశామని తెలి పారు. బుధవారం వరకు 10.40 లక్షల మంది రైతుల నుంచి రూ.12,051 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించినట్టు వివరించారు. ఓపీఎంఎస్లో నమో దైన రూ.11 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.