Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్త్రీనిధి మేనేజింగ్ సభ్యులతో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పేద మహిళలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించి, వారిని సంపన్నులుగా చేయడమేననీ, ఆ లక్ష్యంతోనే స్త్రీనిధి మరింత సమర్థవంతంగా పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళల ఆర్ధిక సాధికారతకు భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్త్రీ- నిధి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని స్త్రీనిధి కొన్ని జిల్లా సమాఖ్యల అధ్యక్షులు, బ్యాంకు డైరెక్టర్లు మంత్రి దయాకర్రావుతో గురువారం సమావేశమయ్యారు. స్త్రీనిధి బ్యాంకు చేస్తున్న పనులను, భవిష్యత్ ఆలోచనలను మంత్రికి వివరించారు.
గ్రామ స్థాయి, మండల సమాఖ్యల పదవీ కాలాన్ని ఐదేండ్లకు పెంచాలని కోరారు. వడ్డీ లేని రుణాల మరింతగా పెంచాలనీ, మహిళా సాధికారతను పెంపొందిస్తున్న స్త్రీనిధిని ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నిఖత్జరీన్, ఇషాసింగ్కు కవిత అభినందనలు
జాతీయస్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషాసింగ్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితను వారు కలిసారు.
వీరిద్దరి విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు.