Authorization
Wed April 30, 2025 07:41:39 am
- తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్‌తో పలు సమస్యలపై చర్చించినట్టు తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి తెలిపింది. గురువారం కమిషనర్‌తో సమావేశం అనంతరం ఆ సమితి నాయకులు మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు నీట్/ ఎంసెట్ /జెఈఈ తదితర కోచింగ్‌లకు కావలసిన మెటీరియల్ ను మరియు బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ ఇవ్వాలి. ప్రభుత్వంతో చర్చించి, ఒప్పించి విద్యార్థులకు కనీసం మూడు నెలలు అనగా పబ్లిక్ పరీక్షల వరకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు ఇవ్వాలి. ఇంటర్మీడియట్ విద్యలో పని చేస్తున్న రెగ్యులర్/ కాంట్రాక్టు బదిలీలు కల్పించాలనే తదితర డిమాండ్లను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.