Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- శంషాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని శ్రీ రామానుజ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గురువారం సందర్శించారు. సమతా మూర్తి స్ఫూర్తి వద్ద రామానుజ చిన్న జీయర్‌స్వామి రాష్ట్రపతికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అంతకుముందు ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల చేరుకున్న రాష్ట్రపతి.. ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం చిన్న జీయర్ స్వామి రాష్ట్రపతి ద్రౌపతి మూర్మును వెంట తీసుకుని 108 దివ్యసాలు సందర్శిస్తూ ఆలయ విశేషాలు తెలియచేశారు. 216 రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడ నుంచి రామానుజన్ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు. త్రిదండి చిన్న జీయర్ రామానుజ స్వామి ఆమెకు మంగళ శాసనాలు ఇచ్చారు.
శ్రీ రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎదురుగా ఏర్పాటు చేసిన డైనమిక్ ఫౌంటైన్ స్పెషల్ షో (త్రీడీ లేజర్ షో)ను తిలకించారు. చిన్న జీయర్ స్వామికి రాష్ట్రపతి ధన్యవాదాలు తెలియజేశారు. ఆమె వెంట గవర్నర్ తమిళి సై, మంత్రి సత్యవతి రాథోడ్, చిన్న జీయర్ ట్రస్ట్ సభ్యులు కె.వి చౌదరి, చలిమెడ లక్ష్మీ నరసింహారావు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, తదితరులు ఉన్నారు.