Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామ పాకాల హరినాథరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్లోని ఆయన రాయదుర్గం వద్ద నివాసానికి వెళ్ళిన కేసీఆర్ హరినాథరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న ద్ణుఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, ఇతర కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావుకు నివాళులర్పించిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, డాక్టర్ ఆంజనేయ గౌడ్ తదితరులున్నారు.