Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను సాగిస్తున్నారన్న ఆరోపణలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన 18 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ అధికారులు శుక్రవారం కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. నిజామాబాద్ కేంద్రంగా మొదట పీఎఫ్ఐ కార్యకలాపాలు వెలుగు చూశాయనీ, అనంరతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరి కార్యక్రమాలు సాగుతున్నట్టు ఎన్ఐఏ చార్జి షీట్లో పేర్కొన్నది. నిజామాబాద్ టౌన్ కేంద్రంగా అబ్దుల్ ఖాదీర్ పీఎఫ్ఐ కార్యకలాపాలను సాగిస్తు న్నట్టు తెలిపింది. ముఖ్యంగా, ముస్లిం యువతను ఆకర్షించి వారిలో దేశ వ్యతిరేక భావాలను పెంపొంది స్తున్నట్టు ఎన్ఐఏ చార్జిషీట్లో వివరిం చింది. అంతేగాక, దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలా పాలను విస్తరించడంతో పాటు అనువైన సందర్బా లలో మత ఘర్షణలు రెచ్చగొట్టడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు ముప్పు తేవడానికి పీఎఫ్ఐ కుట్ర పన్నిందని చార్జిషీట్లో పేర్కొన్నది. బయటకు మాత్రం స్వచ్ఛంద సంస్థగా చెప్పుకుంటూ ముస్లిం యువతకు దేహదారుడ్య శిక్షణను ఇస్తున్నట్టు పీఎఫ్ఐ ప్రచారం చేసుకుంటున్నదనీ, లోపల మాత్రం తన కార్యకర్తల్లో దేశం పట్ల విద్వేషాన్ని నూరి పోస్తున్నదని 18 మంది ఉగ్రవాదులపై చార్జిషీట్లో ఎన్ఐఏ ఆరోపించింది.