Authorization
Sat May 03, 2025 08:17:57 am
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసిన రైతుబంధు నగదు విత్‌డ్రా కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,762 పోస్టల్ మైక్రో ఏటీఎమ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తపాలాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏటిఎమ్లను 5,386 బ్రాంచ్ పోస్ట్మాస్టర్లకు పంపామని పేర్కొన్నారు. ఈ ఏడాది మే నుంచి జూన్ నెలల మధ్య పీఎమ్ కిసాన్ సీజన్లో 86,518 మంది రైతులు 34.58 కోట్ల నగదు లావాదేవీలు జరిపారని వివరించారు. మైక్రో ఏటీఎమ్‌ల ద్వారా జరిగే నగదు లావాదేవీలకు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయట్లేదని తెలిపారు.