Authorization
Fri May 02, 2025 02:04:28 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్రస్థాయి సమావేశం జనవరి 4వ తేదీ నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు అందరు రీజినల్ మేనేజర్లకు ఉత్తర్వులు పంపారు. సంస్థ నిబంధనల ప్రకారం 2020 జనవరి నుంచి వెల్ఫేర్ బోర్డులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయనీ, ప్రతి మూడు నెలలకు ఒకసారి వారు యాజమాన్యంతో సమావేశమై సమస్యల పరిష్కారాన్ని సాధిస్తున్నారని తెలిపారు. 4వ తేదీ జరిగే రాష్ట్రస్థాయి ఎంప్లాయీస్ వెల్ఫేర్బోర్డు సమావేశం హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందని వివరించారు. బోర్డు సభ్యుల కార్మికుల సమస్యల్ని తమ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. అలాగే 'ఎక్స్ట్రా మైల్' అవార్డు గ్రహీతలను గుర్తించి, పేర్లు తెలపాలని సూచించారు.