Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్లు ఉండవనడం సరికాదు-టీఎమ్‌యూ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీలో తక్షణం వెల్ఫేర్ బోర్డులు రద్దు చేసి, యూనియన్లను పునరుద్ధరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎమ్‌యూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ రామచంద్రారెడ్డి, ఎమ్ థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా యూనియన్లను పునరుద్ధరిస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని ఈనెల 27న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. సంపూర్ణ ఉద్యోగ భద్రత సర్క్యులర్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా మార్పులు చేయాలనీ, రెండు వేతన సవరణలు చేపట్టాలనీ, పీఎఫ్, సీసీఎస్ నిధులు చెల్లించాలనీ, కార్మికులపై పనిభారం తగ్గించి, వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. మార్చిన షెడ్యూల్స్‌ను మోటారు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం 8 గంటల పనిని పునరుద్ధరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం అవసరమైన ఆదేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చి, కార్మికుల్లోని అశాంతిని తొలగించాలని అభ్యర్థించారు.