Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి చెప్పారు. అందులో కొంత మంది డబ్బులు, మరికొంత మందికి పదవులు ఆశ చూపించి, గులాబీ కండువా కప్పారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనం అవుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఒకపార్టీ ఇంకొక పార్టీతో విలీనమైన చరిత్ర ఉందనీ, కానీ ఎల్పీ విలీనం అనేది ఎక్కడా లేదని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేస్తామన్నారు.