Authorization
Fri May 02, 2025 11:47:13 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్,వర్కర్లను పర్మినెంట్ చేయాలని ప్రగతిశీల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నాన్‌టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎల్ పద్మ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మార్క్స్ భవన్లో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వర్కర్లను నియమించాలని కోరారు. వారాంతపు సెలవులు అమలు చేయాలనీ, ఖాళీలను భర్తీ చేయాలేని డిమాండ్ చేశారు.
కేజీబీవీల్లో పనిచేస్తున్న వర్కర్లు, నాన్‌టీచింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలనీ, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పి అరుణ్‌కుమార్, ఉపాధ్యక్షులు వీరమణి, సహాయ కార్యదర్శి ముధురలతో పాటు రాష్ట్ర కమిటి సభ్యులు పాల్గొన్నారు.